Advertisement
Google Ads BL

నిత్యానందతో పెళ్లి.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!


రీసెంట్‌గా ‘విరాట పర్వం’ ప్రమోషన్స్‌లో సాయిపల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదమవ్వడం, తద్వారా ఆమెపై కేసులు నమోదవ్వడం వంటి వాటితో.. ఒక్కసారిగా ఆమె ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎందుకంటే, ఎప్పుడూ కామ్‌గా ఉండే సాయిపల్లవి, వాస్తవం మాట్లాడినా కూడా కాంట్రవర్సీలో చిక్కుకోవడం నిజంగానే ఆమెకు షాక్ ఇచ్చింది. ఈ సంఘటన తర్వాత ఆమెనే కాదు.. సెలబ్రిటీలందరూ సెన్సిటివ్ మ్యాటర్ల విషయంలో కాస్త ఆచితూచి మాట్లాడాలనే నిర్ణయానికి రాగా, ఇప్పుడొక హీరోయిన్ ఏకంగా తన పెళ్లిపై మాట్లాడి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రియా ఆనంద్. 

Advertisement
CJ Advs

 

10 సంవత్సరాల క్రితం టాలీవుడ్‌లో ‘లీడర్’, ‘రామరామ కృష్ణకృష్ణ’ వంటి చిత్రాలతో హడావుడి చేసిన ప్రియా ఆనంద్.. మళ్లీ ఇప్పుడు ‘మా నీళ్ల ట్యాంక్’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రోమోషన్‌లో భాగంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఇప్పుడామెని వార్తలలో నిలిపాయి. నిత్యానందని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ మధ్య నిత్యానందపై కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యంతో మరణించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వీడియోలతో సహా బయటికి వచ్చాయి. అలాంటి నిత్యానందను ఆమె పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పడం.. నిజంగానే సంచలన వార్తగా మారిపోయింది. 

 

అయితే ఆమె చేసిన కామెంట్స్‌పై ఎంత సేపో నిలబడలేదు. కాసేపటికే.. ‘నేనేదో జోక్‌ చేస్తే.. దానినే అంతా సీరియస్‌గా తీసుకుంటున్నారు’ అంటూ కామెడీ స్టేట్‌మెంట్స్‌తో మరోసారి ఆమె వార్తలలో వస్తువుగా మారింది. ఇక ఆమె నటించిన ‘మా నీళ్ల ట్యాంక్’ చిత్రం జీ5 ఓటీటీలో ఈ నెల 15 నుండి స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌తో హీరో సుశాంత్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు.

Priya Anand Marriage Comment Goes Viral:

Priya Anand sensational Comments on Nityananda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs