Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ క్రేజా మజాకానా..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ పేరులోనే ఉంటుంది ఓ పవర్ అన్నట్టుగా ఊగిపోతారు పవన్ ఫాన్స్. ఆయన సినిమాలకి గ్యాప్ ఇచ్చి కం బ్యాక్ అయినా ఆయన రేంజ్ తగ్గలేదు, ఆయన క్రేజ్ తగ్గలేదు. అది పవర్ స్టార్ మ్యానియా. పవన్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఎంతెలా పోటీ పడుతున్నారో ఆయన ఒప్పుకుంటున్న ప్రాజెక్ట్స్, లైన్ లో ఉన్న సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గాను హైలెట్ అవుతున్నారు. పీఎం మోడీ ఏపీ వచ్చారు. అల్లూరి విగ్రహం ఓపెన్ చేసారు.. వెళ్లారు. అక్కడికి టిడిపి, సీఎం జగన్, అలాగే చిరు ని ఆహ్వానించారు. కానీ జనసేన ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. పవన్ మోడీని పట్టించుకోలేదు. ఇటు సినిమాల్లోనూ పవన్ కాస్త బిజీ అయ్యారు.

Advertisement
CJ Advs

అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు. కారణం పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తన ఖాతా డీపీని చేంజ్ చేశాడు. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ డీపీని తెగ వైరల్ చేస్తున్నారు. #PawanKalyan #Shocked అనే హాష్ టాగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది నెగెటివ్ గా పవన్ కళ్యాణ్ ఏంటి అలా ఉన్నారు, ఆ లుక్ ఏమిటి సామి అంటూ స్పందిస్తుంటే.. కొందరు పవన్ కళ్యాణ్ డీపీ మారిస్తేనే ఇంతిలా ట్రెండ్ అవుతున్నారు.. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే అంటూ కలర్ ఎగరేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్ సెట్టర్ అంటూ ఫాన్స్ కామెంట్ చెయ్యడం గమనార్హం.

Pawan Kalyan hash tag trends on twitter:

Pawan Kalyan changes his profile picture in Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs