Advertisement
Google Ads BL

PS 1 టీజర్ : మణిరత్నం మార్క్ మ్యాజిక్


దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తాను ఎన్నాళ్లగానో చెయ్యాలనుకున్న డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ని ఇప్పుడు తెరపైకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో భారీ బడ్జెట్ ని, భారీ తరగణాన్ని కోరుకునే పొన్నియిన్ సెల్వన్ స్క్రిప్ట్ ని సినిమాగా తీసుకురావడానికి బాహుబలితో రాజమౌళి తనకి ఎంతో స్ఫూర్తినిచ్చారని కల్మషం లేకుండా ప్రకటించిన మణిరత్నం ఇప్పుడు ఓపెన్ అయిన వైడ్ మార్కెట్ సపోర్ట్ తో తన కలల ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, ప్రభు, పార్తీబన్ ఇంతటి భారీ తారాగణంతో రెండు భాగాలుగా పొన్నియిన్ సెల్వన్ రాబోతుంది. 

Advertisement
CJ Advs

మొదటి భాగం సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో నేడు పొన్నియిన్ సెల్వన్ PS-1 టీజర్ రిలీజ్ అయ్యింది. తెలుగు భాషకి సంబంధించి మహేష్ బాబు తన ఫెవరెట్ డైరెక్టర్ అయిన మణిరత్నం అంటూ PS-1 టీజర్ ని ప్రేక్షకుల ముందు పెట్టారు. టీజర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఎన్నో మణిపూసల్లాంటి సినిమాలని అందించిన మణిరత్నం తొలిసారిగా చేపట్టిన చారిత్రాత్మక కథాంశానికి తనదైన మార్క్ ని, స్పార్క్ ని యాడ్ చేసారు. ఇప్పటివరకు సంజయ్ లీలా భన్సాలీ, అశుతోష్ గోవార్కర్, ఎస్. ఎస్. రాజమౌళి, ఓం రౌత్ వంటి కొందరు భారతీయ దర్శకులు చారిత్రాత్మక కథాంశాలను, యుద్ధ సన్నివేశాలను ప్రేక్షకులను అబ్బురపరిచేలా తీసి ఉన్నప్పటికీ మణిరత్నం మ్యాజిక్ మరోస్థాయిలో ఉండబోతుందా? అనిపించేలా ఉన్నాయి PS-1 టీజర్ విజువల్స్. 

పాత్రలకు తగ్గ నటీనటులను ఎంచుకోవడమే కాకుండా ఆయా పాత్రలకు తగ్గ ఆహార్యం విషయంలోనూ మణి ఎంత శ్రద్ద చూపిస్తారో ఐశ్వర్య రాయ్, త్రిష ల గెటప్స్ చూస్తేనే అర్ధమవుతుంది. అలాగే కార్తీ, జయం రవి, పార్తీబన్ తదిరతరులందరిని కూడా నటులనే విషయం మర్చిపోయి పాత్రలుగా మారిపోయినట్టుగా కనిపించింది. ఇక చియాన్ విక్రమ్ సంగతి చెప్పేదేముంది.. ఏ పాత్రలోకైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేసేంతటి 'గుండె' ధైర్యం ఉన్న నటుడతడు. ఓవరాల్ గా ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేలా అనిపించింది టీజర్. ప్రస్తుతం నడుస్తున్న సౌత్ సినిమాల హవా. పాన్ ఇండియా మార్కెట్ లో మన సినిమాలు చూపిస్తున్న జోరు ఖచ్చితంగా PS-1 పట్ల హ్యుజ్ క్రేజ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. అలాగే అంతటి భారీ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న PS-1 కి మంచి ఫలితం రావాలని ఆశించాలి. 

PS-1 టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Mahesh Babu releases Ponniyin Selvan teaser:

Ponniyin Selvan teaser review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs