Advertisement
Google Ads BL

అప్పుడే అలియా-రణబీర్ ల ప్రేమ బలపడిందట


అలియా భట్ - రణబీర్ కపూర్ లు ఆరేళ్ళ ప్రేమని మరింత బలపరుస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 14 న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మూడు నెలలు తిరక్కుండానే తల్లితండ్రులం కాబోతున్నట్టుగా రణబీర్ - అలియా భట్ లు ఫాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు. తమ ప్రేమ ఎప్పుడు ఎక్కడ గట్టిగా బలపడిందో అలియా భట్ తాజాగా పాల్గొన్న కాఫీ విత్ కరణ్ షో లో బయటపెట్టింది. రణబీర్ తో తన బంధం బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలోనే బలపడింది అంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

Advertisement
CJ Advs

హీరో రన్వీర్ సింగ్ తో కలిసి కరణ్ జోహార్ షోలో పాల్గొన్న అలియా భట్ రణబీర్ తో తన పరిచయం ప్రేమ విషయాల్ని పంచుకుంది. బ్రహ్మాస్త్ర షూటింగ్‌ కోసం నేను రణబీర్ ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. ఆ ఫ్లైట్ లో రణ్‌వీర్‌ సీటు సరిగా లేదు. దానితో రణబీర్ నా పక్కన వచ్చి కుర్చున్నాడు. ఆ సందర్భంలో మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిరుచులని ఒకరం షేర్‌ చేసుకున్నాం. మేమిద్దరం అప్పుడే డిసైడ్‌ అయ్యాం. మా ఈ లాంగ్‌ రిలేషన్‌లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం అంటూ అలియా భట్ రణబీర్ తో ప్రేమ ముచ్చట్లని ఫస్ట్ టైం ఆ షో లో షేర్ చేసుకుంది. అంతకుముందు రణబీర్ అంటే క్రష్ అని చెప్పినా.. ఎప్పుడూ తమ ప్రేమ విషయాలను అలియా భట్ ఎక్కడా బయటపెట్టలేదు.

Alia Bhatt-Ranbir Kapoor love story:

Alia Bhatt shares how Ranbir Kapoor proposed to her in Maasai Mara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs