యాంకర్ అనసూయ ఇప్పుడు ఈటీవికి అందులోనూ జబర్దస్త్ కి బై బై చెప్పెయ్యబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అయితే అనసూయ సినిమా ఆఫర్స్ వస్తున్న కారణంగానే జబర్దస్త్ ని వదలడం లేదట. ఆమె సినిమా ఆఫర్స్ కోసమే జబర్దస్త్ ని వదిలేస్తే.. అటు స్టార్ మా ప్రొగ్రాం లోనూ కనిపించకూడదు. కానీ అనసూయ జబర్దస్త్ ని కావాలనే వదిలేసింది అంటున్నారు. కారణం జబర్దస్త్ లో కమెడియన్స్ లేరు, సరైన జెడ్జెస్ లేని కారణం ఈటీవీలో జబర్దస్త్ ప్రాధాన్యత కోల్పోయేలా ఉంది.
ఇప్పటికే ఆది, సుధీర్, శ్రీను, అభి లాంటి వాళ్ళు వెళ్లిపోవడంతో.. టీఆర్పీ పడిపోతుంది. ఇంకా ఇక్కడే ఉంటే జబర్దస్త్ బోర్డు తిప్పేసినప్పుడు పరువు పోతుంది.. అందుకే ముందుగానే జబర్దస్త్ కి అనసూయ బై బై చెప్పేసేలా ఉంది అంటున్నారు. స్టార్ మా లో చేతికి దొరికిన ప్రోగ్రాం వదలకుండా ఒడిసిపట్టుకుంది అని, అలాగే వెబ్ సిరీస్ లతోనూ అనసూయ బిజీ అవుతుంది అని అంటున్నారు. సో జబర్దస్త్ నుండి అనసూయ కావాలనే తప్పుకుంది అన్నమాట.