Advertisement
Google Ads BL

గౌతమ్ రాజు ఫ్యామిలీకి మెగాస్టార్ సాయం


టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు సహా వివిధ బాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను మెగాస్టార్ చిరంజీవి గారు తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు. ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబానికి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా వెల్లడించారు.

Megastar 2 lakh help to Gautham Raju family:

Megastar Chiranjeevi 2 lakh help to Gautham Raju family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs