మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. పూజ హెగ్డే ఐరెన్ లెగ్. ఆమెకి ఇక సినిమా ఛాన్సెస్ రావేమో అంటూ ప్రచారం జరిగినంతసేపు లేదు.. ఆమెకి విజయ్ దేవరకొండ తో JGM, సల్మాన్ ఖాన్ తో అవకాశాలు రావడానికి. ఇప్పటికే మహేష్ బాబు తో SSMB28 లో హీరోయిన్ గా మహేష్ సరసన నటించబోతుంది. మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్న పూజ హెగ్డే ఐరెన్ లెగ్ హీరోయిన్ ఏమిటి.. ఆమె లక్కీ హీరోయిన్ అయితే అంటూ ఆమె ఫాన్స్ చెబుతున్నారు.
ఇప్పుడు పూజ హెగ్డే కి మరో సూపర్ ఛాన్స్ దొరికింది అంటున్నారు. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకుంటున్నారట. సూర్య చిరుతై శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే సూర్య కి జోడిగా పూజ హెగ్డే ని సంప్రదిస్తున్నారట. ఇప్పటివరకు కోలీవుడ్ లో పూజ హెగ్డే కి ఓ మంచి దక్కలేదు. రెండు సినిమాలు చేసింది రెండు సినిమాలూ ప్లాప్ అయ్యాయి. మరి ఇప్పుడు సూర్య సినిమాలో ఛాన్స్ వస్తే.. నిజంగా పూజ హెగ్డే కి సూర్య అయినా హిట్ ఇస్తారేమో చూడాలి.