టాలీవుడ్ యంగ్ అండ్ ఎనేర్జిటిక్ హీరోస్ మహేష్ బాబు, రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోదు. వాళ్లతో సినిమా ఛాన్స్ రావాలని చాలామంది కోరుకుంటారు. అందులో ఇప్పుడు బేబమ్మ కృతి శెట్టి కూడా చేరింది,. ప్రస్తుతం వారియర్ ప్రమోషన్స్ లో సోలో ఇంటర్వూస్ ఇస్తున్న కృతి శెట్టి వరస హిట్స్ తో మంచి జోరుమీదుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో చెయ్యి తిరగనంత బిజీగా ఉన్న కృతి శెట్టి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికని బయటపెట్టింది.
తాను తెలుగులో చూసిన ఫస్ట్ సినిమా రంగస్థలం అని, రంగస్థలం సినిమా చూసిన వెంటనే రామ్ చరణ్ అంటే అభిమానం ఏర్పడింది అని, చరణ్ సూపర్ క్యూట్‌గా ఉంటారని చెప్పిన కృతి శెట్టి మహేష్ బాబు అంటే ఇష్టమని, ఆయన చాలా హ్యాండ్ సం గా ఉంటారని, ఆ ఇద్దరితో అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ కృతి శెట్టి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి గ్లామర్ డాల్, ట్రెడిషనల్ గాను, అటు గ్లామర్ పరంగాను అద్భుతంగా ఉండే కృతి శెట్టికి స్టార్ ఛాన్సెస్ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం వారియర్ రిలీజ్ కి రెడీ అయితే, నితిన్ మాచర్ల నియోజక వర్గం కూడా రిలీజ్ కి దగ్గరైంది. తర్వాత సుధీర్ బాబు తో ఓ సినిమా, వెంకట్ ప్రభుతో మరో సినిమా, నాగ చైతన్య తో కొత్త ప్రాజెక్ట్స్ ఓకె చేసింది.