Advertisement
Google Ads BL

ఇది నిజమా పవిత్ర లోకేష్


నరేష్ కారణంగా మీడియాలో తరుచు వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్. నరేష్ తో కలిసి ఉంటున్న పవిత్ర లోకేష్ పై నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర లోకేష్ మొదటి భర్త రకరకాలుగా విరుచుకుపడుతున్నారు. అటు నరేష్ తో హోటల్ రూమ్ లో పట్టుబడడం, నరేష్ తో కలిసి ఉండడం, రమ్య వీరిపై అలిగేషన్స్ చెయ్యడం, నరేష్ కూడా పవిత్ర లోకేష్ ఫ్రెండ్ అంటారు, మధ్యలో ఆమెతో కలిసి ఉంటానో, కాపురం చేస్తానో అంటూ మాట్లాడుతుంటారు. ఇలా పవిత్ర లోకేష్ గత కొన్ని రోజులుగా మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది.

Advertisement
CJ Advs

ఇక సినిమాల్లో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన పవిత్ర లోకేష్.. ఇప్పుడు నరేష్ వ్యవహారంతో ఆమె కెరీర్ ఇబ్బందులో పడింది అనే మాట వినిపిస్తుంది. ఇప్పటివరకు మదర్ కేరెక్టర్స్ చేసిన పవిత్ర లోకేష్ కి ఇకపై ఆ ఛాన్స్ లు వచ్చేలా లేవు అంటూ ప్రచారం జరగడమే కాదు, ఇప్పటికే రెండు బిగ్ ప్రాజెక్ట్స్, పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఆమె చేజారిపోయాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. కేవలం నరేష్ వ్యవహారం కారణంగానే పవిత్ర లోకేష్ కి రెండు బిగ్ ఛాన్స్ లు చేజారిపోయినట్లుగా సోషల్ మీడియాలో ఆ న్యూస్ లు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో అనేది పవిత్ర చెబితేనే కానీ తెలియదు. 

Pavitra Lokesh out from two big movie projects:

Pavitra Lokesh Replaced In Two Big Films Already?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs