Advertisement
Google Ads BL

మనసుని హత్తుకునేలా సీతా రామం సాంగ్


దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సీతా రామం టీజర్‌తో మ్యాజికల్ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్నఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్‌లో ఒకటిగా నిలుస్తుంది. మొదటి పాట ఓహ్ సీతా హే రామా సంగీత ప్రియులని అలరించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెండో పాట- ఇంతందం ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా వుంది. వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ దుస్తులలో చాలా అందంగా కనిపించారు. ఆమె నృత్య  ప్రదర్శన కూడా మనోహరంగా వుంది. ఈ సాంగ్ తో దుల్కర్ సల్మాన్ కి మరింత మంది ఫాన్స్ పెరగడం ఖాయం. అంత హ్యాండ్ సం గా కనిపించారు ఆయన. ఇంతందం సాంగ్ లిరిక్స్ మీ కోసం..

♫ఇంతందం దారి మళ్లిందా

భూమిపైకే చేరుకున్నాదా

లేకుంటే చెక్కి వుంటారా

అచ్చు నీలా శిల్ప సంపద

జగత్తు చూడని మహత్తు నీదేలే

నీ నవ్వు తాకి తరించి తపస్సిలా

నిషీధులన్నీ తలొంచే తుషారానివా ♫

పాట పల్లవిలో వినిపించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. ఎస్పీ చరణ్ పాటని చాలా మధురంగా ఆలపించారు

Sita Ramam second single Indhandham out:

Inthandham from Sita Ramam illuminates romance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs