Advertisement
Google Ads BL

ఈసారి అమెజాన్ తో పృథ్వీ రాజ్


మలయాళంలో ప్రస్తుతం పృథ్వీ రాజ్ మ్యానియా నడుస్తుంది. ఆయన థియేటర్స్, ఓటిటి కోసం ఏకంగా 18 ప్రాజెక్ట్స్ ని చకచకా పూర్తి చేస్తున్నారు. దర్శకుడిగా, హీరోగా పృథ్వీ రాజ్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఓటిటి ప్రాచుర్యం ఎక్కువయ్యాక పృథ్వీ రాజ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు వీక్షించడమే కాదు, పృథ్వీ రాజ్ కి ఫాన్స్ గా మారుతున్నారు. ఆయన నటించిన లూసిఫర్, అయ్యప్పన్ కోషియమ్, బ్రో డాడీ, నిన్నగాక మొన్నొచ్చిన జన గణ మన మూవీస్ తో ఆయనకి అన్ని భాషల్లో అభిమానులు ఏర్పడ్డారు. జన గణ మన రెండో పార్ట్ కోసం వెయిటింగ్ అనేలోపలే పృథ్వీ రాజ్ కడువాతో జులై 7న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 

Advertisement
CJ Advs

కడువా సినిమాలో వివేక్ ఒబెరాయ్ కూడా నటించడంతో సినిమాపై మంచి అంచాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే కడువా ఏ ఓటిటిలో రిలీజ్ అవుతుంది అనే క్యూరియాసిటిలో తెలుగు, మలయాళ, తమిళ ఆడియన్స్ ఉన్నారు. కడువా మూవీ ని అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ కి దక్కించుకుంది అని, త్వరలోనే ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటిస్తారని తెలుస్తుంది. పృథ్వీ రాజ్ సినిమాలకు థియేటర్స్ లో కన్నా ఎక్కువ క్రేజ్ ఓటిటీలకే ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు ఓటిటీలలో అంత క్రేజ్ ఉండేది. 

Kaduva OTT deal closed:

Prithviraj Sukumaran Kaduva OTT release date soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs