Advertisement
Google Ads BL

మరోసారి ఎన్టీఆర్ తో మోహన్ లాల్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఎన్టీఆర్ న్యూస్ ఏది బయటకి వచ్చినా, అది రూమర్ అయినా క్షణాల్లో వైరల్ చేస్తున్నారు ఫాన్స్. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు కొరటాల మూవీ మొదలు పెడతారా అని ఆతృతగా ఉన్నారు ఫాన్స్. ఫాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా ఆ సినిమా అప్ డేట్ లేట్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ కొరటాల మూవీ ఆగష్టు నుండి సెట్స్ మీదకెళ్లొచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ మరో మాస్ యాక్షన్ మూవీ చెయ్యబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారని టాక్ ఉండగా.. ఆ ప్లేస్ లో కమల్ హాసన్ పేరు బాగా వినిపించింది. కానీ ఇప్పుడు కమల్ ప్లేస్ లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పేరు వినిపిస్తుంది. ఎన్టీఆర్ - మోహన్ లాల్ ఇద్దరూ కలిసి కొరటాల జనతా గ్యారేజ్ లో నటించారు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ తో మోహన్ లాల్ కలిసి నటించబోతున్నారని, ఎందుకంటే NTR31 పాన్ ఇండియా మూవీ అవడంతో మోహన్ లాల్ ని ప్రశాంత్ నీల్ చూచాయగా సంప్రదించారని టాక్ వినిపిస్తుంది. మరి ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ఫాన్స్ లోనే ఆడియన్స్ లోనూ క్యూరియాసిటీ పెరగడం ఖాయం. 

Mohanlal and NTR Combination once again.:

Mohanlal Key Role in Jr NTR and Prashanth Neel Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs