నటుడు విశాల్ ఈ మధ్యన వరసగా ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఆయన సినిమా షూటింగ్స్ లో తరచూ దెబ్బలు తగిలించుకుంటున్నారు. సామాన్యుడు షూటింగ్ లో కూడా విశాల్ గాయపడ్డారు. కానీ వెంటనే కోలుకుని మళ్ళీ షూటింగ్ కి వచ్చేసారు. కాకపోతే లాఠీ పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ జరుగుతున్నప్పుడు విశాల్ గాయపడగా ఆయన అప్పుడు కేరళ వెళ్లి చికిత్స తీసుకుని కొద్ది నెలల గ్యాప్ తో లాఠీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. విశాల్ యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా నటిస్తారు. దానితో ఆయనకు తరచూ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి.
తాజాగా లాఠీ షూటింగ్ లో మరోసారి విశాల్ కి దెబ్బలు తగిలాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తెరకెక్కుస్తుండంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో విశాల్ కాలికి గాయామైనట్లు తెలుస్తోంది. విశాల్ కి గాయమవడంతో లాఠీ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. గతంలో షూటింగ్ సమయంలో విశాల్ కి జరిగిన ప్రమాదం కన్నా ఇది కాస్త ఎక్కువ ప్రమాదం అంటున్నారు. విశాల్ కి గాయాలవడంతో ఆయన ఫాన్స్ కంగారులో ఉన్నారు. విశాల్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు వారు.