పుష్ప స్టార్ట్ చేసిన సమయంలో దర్శకుడు సుకుమార్ విజయ్ సేతుపతిని విలన్ గా ఫైనల్ చేసుకుని సెట్స్ మీదకి వెళ్లారు. మధ్యలో కొద్దిగా గ్యాప్ రావడం, తర్వాత ఏం జరిగిందో విజయ్ సేతుపతి పుష్ప నుండి తప్పుకున్నారు. విజయ్ సేతుపతి అయితే ఆ రోల్ కి మైలేజ్ వస్తుంది. ముఖ్యంగా తమిళంలో పుష్ప కి క్రేజ్ వస్తుంది అని సుకుమార్ భావించినా ఆయన తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ ని తీసుకువచ్చారు. అయితే విజయ్ సేతుపతి పుష్ప కేరెక్టర్ నచ్చకే ఆయన బయటికి వచ్చారనే ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం మరోసారి సుకుమార్ మరోసారి విజయ్ సేతుపతిని సంప్రదించారని, విజయ్ సేతుపతి కూడా సుకుమార్ అడగ్గానే ఒప్పుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఫహద్ ఫాసిల్ తో పాటుగా విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా పార్ట్ 2 లో చూపించేందుకు సుకుమార్ స్కెచ్ వేశారని అంటున్నారు. అల్లు అర్జున్ తో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిలు తలపడబోయే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి పుష్ప పార్ట్ 1 లో మిస్ అయినా పుష్ప పార్ట్ 2 లో విజయ్ సేతుపతి పక్కా అంటున్నారు.