Advertisement
Google Ads BL

జబర్దస్త్ ని చూసినట్టుగానే ఉంది


జబర్దస్త్ లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, అదిరే అభి, చమ్మక్ చంద్ర, ఆర్పీ, ఇంకా అప్పి ఇలా అందరూ కామెడీ చేస్తుంటే జబర్దస్త్ స్టేజ్ మొత్తం కళగా కనిపించేది. హైపర్ ఆది ఆల్మోస్ట్ స్కిట్స్ అన్ని కొట్టుకుంటూ వెళ్ళేవాడు. సుడిగాలి సుధీర్ కూడా తన టీం శ్రీను, రామ్ ప్రసాద్ తో కలిసి స్కిట్స్ కొట్టేవాడు, సందడి చేసేవాడు. ఇక అనసూయ కూడా జబర్దస్త్ స్టేజ్ పై డాన్స్ చెయ్యడమే కాదు, అదిరిపోయే స్టయిల్ తో అప్పుడప్పుడు ఆది స్కిట్స్ లో మెరిసేది. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో ఆ కళ లేదు, కమెడియన్స్ ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. అలాగే జేడ్జ్ లు కూడా వారానికొకరు చొప్పున  మారుతున్నారు. అంతా గందర గోళం కింద ఉంది. 

Advertisement
CJ Advs

కానీ స్టార్ మా మాత్రం జబర్దస్త్ కమెడియన్స్ అందరిని భారీ పారితోషకాలకు లాగేసింది. ఇక్కడ స్టార్ మా లో రకరాల కామెడీ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టారు. జబర్దస్త్ కమెడియన్స్ తోనే కామెడీ స్టార్స్ మొదలు పెట్టి ఎండ్ చేసారు. అలాగే ఇప్పుడు ఆదివారం పార్టీ చేద్దాం పుష్పా అంటూ జబర్దస్త్ కమేడియన్స్ తోనే ఆ షో ని మొదలు పెట్టారు. సుధీర్ యాంకరింగ్ మాత్రమే కాదు స్కిట్స్, డాన్స్ కూడా చేస్తున్నాడు. అనసూయ నాగబాబు జేడ్జ్ లు గా ఉన్నారు. అంతేనా అనసూయ స్పెషల్ సాంగ్ ఇరగదీసింది. అలాగే ఆర్పీ, అభి, అవినాష్ ఇలా జబర్దస్త్ బ్యాచ్ అంతా స్టార్ మా స్టేజ్ పై కామెడీ చేస్తూ, డాన్స్ లు వేస్తూ కనబడే సరికి అందరూ మరో జబర్దస్త్ లా ఉంది ఈ పార్టీ చేద్దాం పుష్ప ప్రోగ్రాం, ఎందుకంటే ఇక్కడ మొత్తం జబర్దస్త్ కమెడియన్స్  ఉన్నారు కదా, అందులోనూ అనసూయ కూడా వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Party Cheddam Pushpa Highlights :

Sta Maa Party Cheddam Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs