మధురవాణిగా వేశ్య పాత్రలో అనసూయ


జబర్దస్త్ యాంకర్, సోషల్ మీడియా క్వీన్ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెర అవకాశాలతో వెలిగిపోతుంది. జబర్దస్త్ షో నుండి అనసూయ తప్పుకోబోతుంది అని తెలుస్తుంది. మరోపక్క స్టార్ మా ప్రోగ్రామ్స్ లో అనసూయ కనిపిస్తుంది. సూపర్ సింగర్ జూనియర్స్ కి అనసూయ యాంకరింగ్ చేస్తుంది. అంతేకాకుండా పార్టీ లేదా పుష్పా ప్రొగ్రమ్ కి గెస్ట్ గా వచ్చింది. ఈ మధ్యన కాస్త బొద్దుగా మారిన అనసూయ కి వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నిహారిక తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న ఈ గ్లామర్ యాంకర్ కి ఇప్పుడు కన్యాశుల్కం నవల ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ వచ్చిందని తెలుస్తుంది.

అది కూడా వేశ్య గా అనసూయ ఆ వెబ్ సీరీస్ లో నటించబోతుందట. ఆ వెబ్ సిరీస్ లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ భరద్వాజ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సిరీస్‌ కి క్రిష్ స్క్రిప్ట్ అందించడమే కాదు, ఆయన నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సీరీస్ ని సౌత్ లోని అన్ని భాషలు అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.

Anasuya Bharadwaj will do prostitute role in web series:

Anasuya Playing The Role Of Prostitute In Kanyasulkam Web Series 
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES