Advertisement
Google Ads BL

షాకింగ్: నరేష్-పవిత్రపై చెప్పుతో దాడి


మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న నరేష్ - పవిత్ర లోకేష్ మేటర్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. నరేష్, పవిత్ర లోకేష్, నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి లు ఎవరికి వారే సోలో గా ప్రెస్ మీట్స్ పెడుతూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నరేష్ తన మాజీ భార్య రమ్య పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అటు రమ్య కూడా నరేష్ పై పవిత్ర లోకేష్ పై ఇంకాస్త శృతిమించిన కామెంట్స్ చేస్తుంది. మరోపక్క పవిత్ర లోకేష్ నాకే పాపం తెలియదు అంటూ మీడియా తోనూ, పోలీస్ లకి ఫిర్యాదులు చేస్తుంది. నరేష్ నాలుగో పెళ్లి వ్యవహారం టాలీవుడ్ నుండి కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
CJ Advs

నరేష్ - పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరగడం, మధ్యలో నరేష్ భార్య రమ్య సీన్ లోకి రావడం, ఆమె నరేష్ భయపెట్టి విడాకులిస్తున్నారని అనడం, రమ్య మంచిది కాదు అందుకే ఆమెకి విడాకులు ఇస్తున్న అని నరేష్ చెప్పడం.. ఇవన్నీ ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న సమయంలోనే నరేష్ పవిత్ర లోకేష్ పై మైసూర్ లో నరేష్ మాజీ భార్య రమ్య చెప్పు తీసుకుని దాడి చెయ్యడం మరింత వేడిని రాజేసింది. నేను నరేష్ తో సంసారం చేసేందుకు రెడీగా ఉన్నాను, కానీ పవిత్ర లోకేష్ అడ్డుపడుతుంది అంటూ గోల చేస్తున్న రమ్య ఈ రోజు.. మైసూర్ లో నరేష్-పవిత్ర లోకేష్ లు ఒకే రూమ్ లో ఉన్న సంయమలో వారిపై అనూహ్యంగా చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించడంతో... అక్కడే ఉన్న న‌రేశ్, ప‌విత్రా లోకేశ్‌ల‌కు సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. రమ్య, నరేష్-పవిత్రలపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నిస్తున్న వీడియో మీడియాలో వైరల్ అయ్యింది.

రమ్యని పోలీస్ లు అడ్డుకోవడంతో నరేష్ రమ్యని ఇంకాస్త ఏడిపించడానికి విజిల్ వేస్తూ మాట్లాడుకుంటూ అక్కడినుండి వెళ్ళినపోయిన దృశ్యాలు వైరల్ గా మారాయి.

Ramya attempt to attack with slipper on Naresh and Pavithra Lokesh:

Naresh third wife Ramya attempt to attack with slipper on Naresh and Pavithra Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs