చిరు ఈ మధ్యనే అమెరికా కి వెళ్లి ఓ నెల రోజులు పాటు భార్య తో కలిసి వెకేషన్స్ కి వెళ్లి వచ్చారు. వచ్చాక గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 షూటింగ్స్ తో ఆయన బిజీ అయ్యారు. అలాగే పక్కా కమర్షియల్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరు మరోసారి విదేశాలకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. దేనికి అంటే మెగా 154 ప్రాజెక్ట్ కోసం. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మెగా 154 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ సినిమాకి వాల్తేర్ వీరయ్య టైటిల్ ని పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. సంక్రాంతికే రిలీజ్ అంటూ ప్రకటించారు కూడా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ని యూరప్ లో ప్లాన్ చేసారు బాబీ. యూరప్‌లోని మాల్టా దేశంలో 20 రోజుల పాటు షూట్ చేయనున్నారట. అక్కడ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. మెగా154 తదుపరి షెడ్యూల్ అక్కడే జరుగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొనుంది అని సమాచారం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.