పవన్ కళ్యాణ్ చేతిలో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా.. ఆయన మాత్రం సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుంటూనే ఉన్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా మేనల్లుడు తో తమిళంలో హిట్ అయిన వినోదియం సీతం రీమేక్ ని సైలెంట్ గా మొదలు పెట్టేసి అందరికి షాకిచ్చారు. రీసెంట్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ పూజా కార్యక్రమాలతో సైలెంట్ గా మొదలైపోయింది. కానీ రెగ్యులర్ షూట్ కి ఎప్పుడు వెళుతుందో అనే కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
తాజాగా ఈ రీమేక్ రెగ్యులర్ షూట్ జులై రెండో వారం నుండే మొదలు కాబోతుంది అని, పవన్ కళ్యాణ్ కూడా మొదటి షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ త్వరత్వరగా పూర్తి చెయ్యడానికి సముద్రఖని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారట. ముందుగా పవన్ కళ్యాణ్ - ఆయన మేనల్లుడు సాయి తేజ్ కాంబో సీన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు కేటాయించారట. దానికే పవన్ కళ్యాణ్ 50 కోట్లకి పైగా పారితోషకం తీసుకోబోతున్నారని టాక్.