మెగాస్టార్ చిరంజీవి తాను కొరటాల దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమాని ఏప్రిల్ 29 న రిలీజ్ చేసారు. ఆ సినిమా చిరుకి బిగ్గెస్ట్ డిసాస్టర్ ని ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో మూవీ గాడ్ ఫాదర్ సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఐదు నెలల గ్యాప్ లో చిరు తన గాడ్ ఫాదర్ సినిమాతో మెగా ఫాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నారు. గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ జులై 4 సాయంత్రం రివీల్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసారు. అప్పటినుండి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ అయ్యేవరకు సినిమాపై అందరిలో ఆసక్తి కలిగేలా చెయ్యాలనేది చిరు ప్లాన్ గా చెబుతున్నారు. మళ్ళీ నాలుగు నెలలో గ్యాప్ లో చిరు మరో సినిమా సంక్రాంతి రేస్ లోకి వచ్చేస్తుంది.
బాబీ దర్శకత్వంలో మెగా 154 గా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించేసారు. మరి వరసగా ఐదు నెలల గ్యాప్ లో మెగా ఫాన్స్ కి చిరు ట్రీట్స్ ఇవ్వడానికి రంగం చేస్తున్నారు. మరి మెగా 154 రిలీజ్ అయిన కొద్ది నెలలకే భోళా శంకర్ కూడా రిలీజ్ కి మెహెర్ రమేష్ రెడీ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలా ఉంది మెగాస్టార్ లైనప్. ఆ తర్వాత కొత్తగా మారుతి ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది. మరి వెంకీ కుడుములతో చిరు సినిమా ఆగిపోయింది అనే న్యూస్ నడుస్తుంది. లేదంటే ఆ మూవీ తోనూ మెగా ఫాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకునేవారు.