Advertisement
Google Ads BL

తన రిలేషన్ పై ఓపెన్ అయిన శృతి హాసన్


శృతి హాసన్ ఈమధ్యన సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ప్రస్తుతం శృతి హాసన్ పలు సినిమాలతో బిజీ అవడమే కాదు, అప్పుడప్పుడు తన పర్సనల్ ప్రోబ్లెంస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన కొత్త ప్రియుడు శంతను తో గడిపే ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో ఉంచుతుంది. తాజాగా తన రిలేషన్ షిప్ పై శృతి హాసన్ ఓపెన్ అయ్యింది. గతంలో నాకు ఓ రిలేషన్ షిప్ ఉండేది. కానీ అప్పట్లో దాని గురించి నేను బయట పెట్టలేదు. ఎందుకంటే నాతో రిలేషన్ మెయింటింగ్ చేసిన అతనికి దానిని బయటికి చెప్పుకోవడం నచ్చేది కాదు. 

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు నేను మరో వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. దానిని దాచి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టే ఓపెన్ గా చెబుతున్నా. నా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో గడపాలనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది. మేము ఏ ప్లేస్ లో ఉన్నా ఎక్కడికి వెళ్లినా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటారు. సో.. మా రిలేషన్ షిప్ ని మేం దాచాలన్నా దాగదు. నేను కూడా తనతో నా అనుబంధం గురించి దాచాలనుకోవడం లేదు. ఎందుకంటే నా లైఫ్‌లో ఆ అనుబంధానిది చాలా పెద్ద పార్ట్. నేనెంతో కష్టపడి పని చేసి ఇంటికెళతాను. ఆ తర్వాత నా జీవితంలో ఓ అద్భుతమైన పార్ట్‌నర్‌తో ఉంటాను. అంటూ శృతి హాసన్ చెప్పింది. అయితే శృతి హాసన్ చెప్పింది అంతా శంతను గురించే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Shruti Haasan opens up about her relationship:

Shruti Haasan On Her Relationship With Beau Santanu Hazarika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs