Advertisement
Google Ads BL

పెళ్లి కాకుండా దేవుడే కాపాడాడు


బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుశ్మిత సేన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. రెండు మూడు బ్రేకప్ లవ్ స్టోరీస్ ఉన్నాయి సుష్మిత సేన్ జీవితంలో. రీసెంట్ గాను తనకన్నా చిన్న వాడు అయిన రోమాన్ షాల్ ప్రేమలో పడి, అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. రోమాన్ షాల్ - సుష్మిత పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. కానీ రోమాన్ షాల్ తోనూ సుష్మిత బ్రేకప్ చేసుకుంది. అయితే సుష్మిత కి పెళ్లి కాకపోవడానికి తన ఇద్దరి కూతుర్లే కారణమంటున్నారు చాలామంది. సుష్మిత ఇద్దరి పిల్లలని దత్తత తీసుకుని వారిని జాగ్రత్తగా పెంచుకుంటుంది.

Advertisement
CJ Advs

అయితే తనకి పెళ్లి కాకపోవడానికి కారణం తన కూతుర్లు రెనీసేన్, అలీషా కారణం కానే కాదని స్పష్టం చేసింది. తన పెళ్లి మూడుసార్లు పీటలవరకు వచ్చి ఆగింది అని, పెళ్లి చేసుకోకుండా దేవుడే కాపాడాడు అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి కాకపోవడానికి రీజన్స్ ఏమి చెప్పలేను కానీ, దేవుడు మాత్రం నన్ను మూడుసార్లు కాపాడాడు. నేను గజిబిజి గా పెళ్లి బంధంలో చిక్కుకుని పోవడం దేవుడికి ఇష్టం లేదు, ఎవరైనా వచ్చి నా బాధ్యతలు పంచుకోవాలని అనుకోవడం లేదు, అన్నిటికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. 

అదృష్టవశాత్తు నా లైఫ్ లో ఓ మంచి వ్యక్తి తారసపడ్డాడు. అతన్ని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతను నన్ను నిరుత్సాహ పరిచాడు. అతన్ని నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నా పిల్లలు కాదు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా రెండు చేతులతో ఆహ్వానించేందుకు నా పిల్లలు సిద్ధంగా ఉన్నారు.. అంటూ సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పుకొచ్చింది.

Sushmita Sen says God saved her from marriage:

Sushmita Sen says God saved her from marriage, reveals only reason I never got married is...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs