Advertisement
Google Ads BL

కొరటాల కోసం ఎన్టీఆర్ త్యాగం


తారక్ నటించిన ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యింది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఓటిటిలో కూడా వచ్చేసింది. రేపో మాపో టీవీ ప్రీమియర్స్ కి కూడా రాబోతుంది. కానీ తారక్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని ఇంకా మొదలుపెట్టనేలేదు. అసలు కొరటాలతో ఎన్టీఆర్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన ఫాన్స్ ఎదురు చూడడమే కాదు, ఎన్టీఆర్ ఫాన్స్ కొరటాలపై ఆగ్రహంగాను ఉన్నారు. అసలే మూడేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్న ఎన్టీఆర్ ని మళ్ళీ ఏ రెండేళ్లకో బిగ్ స్క్రీన్ మీద చూపించేలా ఉన్నాడు కొరటాల అంటూ తిడుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.

Advertisement
CJ Advs

కొరటాల - ఎన్టీఆర్ సినిమా ఆగష్టు కానీ సెప్టెంబర్ లో కానీ మొదలయ్యే ఛాన్స్ వుండడంతో ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల మూవీ కోసం తన వెయిట్ త్యాగం చేస్తున్నారట. కొరటాల మూవీలో స్లిమ్ గా హ్యాండ్ సం గా, ఫుల్ మేకోవర్ లో కనిపించేందుకు ఎన్టీఆర్ బరువు తగ్గుతున్నారనే న్యూస్ ఎప్పటినుండో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉన్న ఈ రెండు నెలల టైం ని ఎన్టీఆర్ వెయిట్ లాస్ కోసం ఉపయోగిస్తున్నారట. తన పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఏడు నుండి ఎనిమిది కిలోల బరువు ని కరిగిస్తున్నారట. సినిమా మొలయ్యేటప్పటికీ ఎన్టీఆర్ లుక్ చేంజ్ కావాలని కొరటాల పెట్టిన టార్గెట్ తో ఎన్టీఆర్ జిమ్ కష్టాలు మొదలైయ్యాయి అంటున్నారు.

NTR is Yet to Undergo a Makeover for NTR30:

NTR on a weight loss Mission
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs