Advertisement
Google Ads BL

కిర్రాక్ ఆర్పీ గుండెపై నాగబాబు పచ్చబొట్టు


జబర్దస్త్ లో నాగబాబు జేడ్జ్ గా ధనరాజ్, వేణు , సుధీర్, ఆది, ఆర్పీ లాంటి కమెడియన్స్ స్కిట్స్ చేసేవారు. రోజా కన్నా ఎక్కువగా నాగబాబు కి ఇంపార్టెన్స్ ఉండేది. కమెడియన్స్ అందరూ నాగబాబు భజన చేసేవారు, ఆరాధించేవారు. అయితే నాగబాబు జేడ్జ్ స్థానం నుండి తప్పుకోగానే ఆయనతో పాటుగా కిర్రాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు వేరే ఛానల్ కి వెళ్లిపోయారు. అప్పట్లో ఆర్పీ నాగబాబు దేవుడు అని, జబర్దస్త్ నాకేమి లైఫ్ ఇవ్వలేదు, మేము కష్టపడితేనే పారితోషకాలు ఇచ్చారు అంటూ సంచలనంగా మాట్లాడాడు ఆర్పీ. ఇక జబర్దస్త్ కి  వెళ్ళేది లేదు అని, డైరెక్షన్ చేస్తాను అని కూడా చెప్పాడు. జీ ఛానల్ లో కామెడీ చేసిన ఆర్పీ ఆ షో ఆగిపోవడంతో కొన్నాళ్ళు బుల్లితెరకు దూరంగానే ఉన్నాడు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత నాగబాబు స్టార్ మా లోకి ఎంట్రీ ఇచ్చాక ఆర్పీ కూడా స్టార్ మా లో తేలాడు. స్టార్ మా లో కామెడీ స్టార్స్ లో కామెడీ చేస్తున్నాడు. అయితే తాజాగా స్టార్ మా లో పార్టీ లేదా పుష్ప ప్రోగ్రాం లో ఆర్పీ అతనికి కాబోయే భార్యని పరిచయం చేసాడు. ఇద్దరికీ స్టేజ్ పై దండలు మార్పించారు. ఆర్పీ ఎంత మంచివాడు అంటే, నమ్మినవాళ్ల కోసం ఏమైనా చేస్తాడు అని సుధీర్ చెప్పడంతో దానితో నాగబాబు ఏకీభవించారు. ఆ తర్వాత సుధీర్ ఆర్పీ ఎవరినైనా ప్రేమిస్తే పిచ్చిగా ప్రేమిస్తాడు, అందులో నాగబాబు గారిని ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో చెప్పాలి అంటే అంటూ ఆర్పీ షర్ట్ విప్పి చూపించగా ఆర్పీ గుండెలపై నాగబాబు పేరు పచ్చ బొట్టు కనిపించింది. దానితో నాగబాబు షాక్ అయ్యారు. అదేమిట్రా ఎప్పుడూ నాకు చెప్పలేదు అనగానే ఆర్పీ పరిగెత్తుకుంటూ నాగబాబు దగ్గరకి వెళ్లి నాగబాబు గారి నవ్వులో నుండి మేమంతా పుట్టాం అంటూ భారీ డైలాగ్ కూడా చెప్పాడు.

Kiraak RP Shows His Love Towards Nagababu :

Kiraak RP Shows His Love Towards Nagababu with Tattoo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs