Advertisement
Google Ads BL

నరేష్ vs మూడో భార్య రమ్య


ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ నరేష్ మీడియా లో హాట్ న్యూస్ గా నిలుసున్నారు. కారణం ఆయన చేసుకోబోయే నాలుగో పెళ్లి. నటి పవిత్ర లోకేష్ ని నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సెలబ్రిటీస్ ఏది చేసినా వింటే.. మాములు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా అంటూ స్పందిచిన నరేష్ పై ఆయన మూడో భార్య సంచలన కామెంట్స్ చేసింది. తమకి దగ్గరవుతూనే తమని పవిత్ర లోకేష్ మోసం చేసింది అని, తన ఫ్యామిలీ ప్రతిష్టను మంట గలిపేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది కూడా తన భర్త వీకే నరేష్ అని, ఆయన నాపై కుట్రలు పన్నుతున్నారు అని నరేష్ మూడో భార్య రమ్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement
CJ Advs

అంతేకాకుండా నరేష్ కి తనకి విడాకులు కూడా అవలేదు అని, నరేష్ నోటీసు లు పంపించారు. కానీ మెయింటనెన్స్ విషయం లో పెండింగ్ లో ఉంది అని రమ్య చెబుతుంది. అయితే రమ్య ఆరోపణలకు బదులివ్వడానికి నరేష్ బెంగుళూరు వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. అక్కడ కన్నడ మీడియా లో ఒకరు పవిత్ర లోకేష్ దగ్గర స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది అంటూ వార్తలు రావడంతో నరేష్ ఉన్నట్టుండి మీడియా సమావేశం రద్దు చేసుకుని కారులో ఎక్కి వెళ్లబోగా.. ఆయన్ని మీడియా వెంబడించింది దానితో నరేష్ న్యాయం కావాలి, త్వరలోనే అన్ని విషయాలను బయటపెడతాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోవడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Sr Naresh vs Ramya :

Sr Naresh vs Ramya 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs