Advertisement
Google Ads BL

మీనా భర్త మరణం: అంతా 2 డేస్ లోనే


హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ ఈ మంగళవారం రాత్రి 8 గంటల సమయలో లంగ్ ఇన్ఫెక్షన్ తో కన్ను మూసిన విషయం తెలిసిందే. నిన్న బుధవారం మీనా స్వగృహంలోనే విద్య సాగర్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మీనా ని ఓదార్చారు. అయితే మీనా భర్త మరణానికి పావురాల మలవిసర్జన వలనే ఆయన లంగ్స్ చెడిపోయి ఆయనకు మరణం సంభవించింది అంటూ అనేకరకాల వెబ్ సైట్స్ లో, చెన్నై మీడియాలో ప్రముఖంగా వినబడింది. అయితే జనవరిలో మీనా ఫ్యామిలీ అంతా కోవిడ్ బారిన పడి కోలుకున్నారు అని, తర్వాత ఆయనకి బర్డ్ ఇన్ఫెక్షన్ కూడా సోకినట్లుగా మీనా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ కళ చెబుతున్నారు.

Advertisement
CJ Advs

తాను మీనా తో 25 ఏళ్ళ స్నేహం కొనసాగిస్తున్నాను అని, విద్య సాగర్ మరణం అంతా రెండు రోజుల్లో జరిగిపోయిది అని ఆమె చెప్పారు. మార్చి నెలాఖరున ఆయనకి కోవిడ్ వలన వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ పెరిగింది అని, బర్డ్ ఇన్ఫెక్షన్ కూడా ఆయనికి ఎటాక్ అయ్యింది అని, అప్పుడే ఆయన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు అని, కానీ డాక్టర్స్ ఆయనేకేం కాదని చెప్పారని, లంగ్స్ మార్పిడి చెయ్యాలని చెప్పారని, జూన్ పది న కూడా ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారని, కానీ చనిపోయే ముందు రెండు రోజుల నుండి ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారని, అప్పటినుండి ఆయన బాడీలోని ఆర్గాన్స్ ఒక్కొక్కటిగా పని చేయకపోవడంతో ఆయన చనిపోయారని ఆమె చెప్పారు. ఇక లంగ్స్ ఆర్గాన్స్ డొనేషన్ కోసం వారు అప్లై చేసినా.. ఆయనకన్నా ముందు చాలామంది ఉండడంతో మూడు నెలలు ఆసుపత్రిలోనే ఉండి ఆయన కన్ను మూసినట్లుగా కళ చెప్పారు.

Meena Husband Vidyasagar Dies at 48 Due to Lung Disease:

Meena husband Vidyasagar passes away due to lung infection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs