Advertisement
Google Ads BL

భర్త కి మీనా అన్నీ తానై అంత్యక్రియలు


మంగళవారం రాత్రి మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్ను మూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆయన చెన్నై లోని ఆసుపత్రిలో మరణించారు. చిన్నవయసులోనే ఆయన ఆకస్మిక మరణం అందరిని కంటతడి పెట్టించింది. భర్త మరణంతో మీనా కుప్పకూలిపోయారు. నిన్న బుధవారం విద్యాసాగర్ భౌతిక కాయాన్ని మీనా ఇంట్లోనే ఉంచారు. చెన్నై లోని పలువురు ప్రముఖులు రజినీకాంత్, శరత్ కుమార్ ఇంకా మీనా స్నేహితులైన కొంతమంది హీరోయిన్స్ ఆమె స్వగృహానికి తరలి వెళ్లి మీనాని ఓదార్చారు. మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు చెన్నైలోని మీనా స్వగృహంలో నిర్వహించారు.

Advertisement
CJ Advs

మీనాకి ఓ పాప ఆమె పేరు నైనికా. కొడుకులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలు అన్ని తానై నిర్వహించడం అక్కడికి వచ్చినవారందరిని కంట తడి పెట్టించింది. తనకి కొడుకులు లేకపోవడం, అలాగే తన భర్త అంటే ఎంతో ఇష్టమైన మీనా తన భర్త దహన సంస్కారాలు తానే చేయాలని ఉద్దేశంతో ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. మీనా తన ఇంటి ముందే భర్త అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేసుకున్నారు. మీనా మరియు ఆమె కుమార్తె నైనిక వారి ఇంటి వెలుపల అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత భౌతికకాయానికి దహన సంస్కారాల నిమిత్తం బీసెంట్‌నగర్‌కు తరలించారు. 

Meena husband Vidyasagar death cremation:

Meena Husband Vidyasagar Funeral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs