Advertisement
Google Ads BL

పెళ్లి రూమర్స్ పై రామ్ స్పందన


గత నాలుగు రోజులుగా హీరో రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడు, ఆయన తన స్కూల్ మేట్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు, రామ్ పెళ్లిపై ఆయన ఫ్యామిలీ త్వరలోనే ప్రకటన చేయనుంది అంటూ రకరకాల న్యూస్ లు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఇలాంటి గాసిప్స్ ఆ నోటా ఈ నోటా రామ్ వరకు వెళ్ళింది. ప్రస్తుతం వారియర్ ప్రమోషన్స్ లో బిజీ కాబోతున్న రామ్ ముందు తన పెళ్లి రూమర్స్ పై సరదాగా ఓ ట్వీట్ వేసి మరీ స్పందించాడు. 

Advertisement
CJ Advs

పెళ్లి రూమర్స్ పై రామ్ ఫన్నీగా.. ఓరి దేవుడా.. ఇక ఆపండి. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఈ రూమర్స్ విషయమై నా సొంత ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి కూడా నేను సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నేను నా హై స్కూల్ ఫ్రెండ్‌ని, సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నాను అనే రూమర్లు ఇంటి వరకు వచ్చేసాయి. నేను ప్రస్తుతానికి ఎవ్వరినీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇంకా గట్టిగా  చెప్పాలంటే.. నేను చిన్నప్పుడు సరిగ్గా స్కూల్‌కి కూడా వెళ్లేవాడిని కాదు.. అలాంటిది నాకో స్కూల్ మేట్, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అంటూ ట్వీట్ చెయ్యడంతో రామ్ పెళ్లి వార్తలు గాలి వార్తలే అని తేలిపోయాయి. 

Ram Pothineni Brushes Off Wedding Rumours:

Ram Pothineni reacts on his marriage rumors tweet goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs