Advertisement
Google Ads BL

జబర్దస్త్ కి అనసూయ గుడ్ బై చెబుతుందా?


ఈటీవీలో మల్లెమాల సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన జబర్దస్త్ పై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. జబర్దస్త్ కి ఎంతో బలమైన కమెడియన్స్ ఒక్కఒక్కరిగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే టాప్ కమెడియన్స్ అందరూ వెళ్లిపోయారు. ఆది, సుధీర్, అవినాష్ లాంటి వాళ్ళు జబర్దస్త్ కి దూరమయ్యారు. అయినప్పటికీ గ్లామర్ యాంకర్స్, మిగతా సీరియల్ ఆర్టిస్ట్ లతో జబర్దస్త్ లాగించేస్తున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ కి గ్లామర్ ని పరిచయం చేసిన అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పెయ్యబోతుందా.. అంటే ఏమో ఆమె చేసిన ట్వీట్ చూస్తే అదే నిజమనిపిస్తుంది అంటారు.

Advertisement
CJ Advs

బుల్లితెర మీద గ్లామర్ గా యాంకరింగ్ చేస్తూ.. స్టేజ్ పై హొయలు పోతూ.. జబర్దస్త్ కి గ్లామర్ ని చూపించిన అనసూయ ఒకప్పుడు పారితోషకం విషయమై జబర్దస్త్ కి దూరమవగా అనూహ్యంగా రష్మీ ఆమె ప్లేస్ లోకి రావడం, తర్వాత అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో మల్లెమాల యాజమాన్యం గురు, శుక్రవారాలు అంటూ జబర్దస్త్ ని మార్చేసింది. అప్పటినుండి అనసూయ కి ఎదురు లేదు. జెడ్జెట్ అంత పాపులారిటీ ఉన్న అనసూయ గ్లామర్ ముందు ఎవరొచ్చినా దిగడుపే అన్నట్టుగా తయారైంది వ్యవహారం. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా, లేదు వెండితెర అవకాశాలు పెరుగుతున్న దృష్యా ఇప్పుడు ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిందా అనే అనుమానం మొదలయ్యింది. 

ఎంతో ఆనందం, అంతే బాధాకర ఘటనలు, తాను ప్రస్తుతం మిక్స్డ్ ఎమోషన్ క్యారీ చేస్తున్నాను అని, ఫ్యూచర్ లో సాధించాల్సిన విజయాల కోసం ముందుకు వెళ్తున్నాను అని, ఇప్పుడు ఏ విధమైన సపోర్ట్ ఇస్తున్నారో ఫ్యూచర్ లోనూ అంతే సపోర్ట్ ఇవ్వండి అంటూ అనసూయ చేసిన పోస్ట్ వైరల్ కాగా.. జబర్దస్త్ గురించి ప్రస్తావించకపోయినా.. ఆమె కూడా జబర్దస్త్ ని వదిలేసే క్రమంలోనే ఈపోస్ట్ పెట్టిందేమో అంటున్నారు నెటిజెన్స్.

Anchor Anasuya Emotional Tweet:

Anasuya goodbye to Jabardasth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs