Advertisement
Google Ads BL

ముంబై చుట్టూ తిరుగుతున్న పుష్ప రాజ్


పుష్ప సినిమాతో హిందీలో తనకంటూ ఓ ఇమేజ్ ని ఫామ్ చేసుకుని నార్త్ ప్రేక్షకుల మనసులను దోచేసిన పుష్ప రాజ్.. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తో బిజీగా వుంటారు అనుకుంటే.. ఆయన ముంబై చుట్టూ ప్రదక్షణలు చెయ్యడమే ఎవ్వరికి ఓ రకంగా అంతుపట్టడం లేదు. సుకుమార్ తో పుష్ప ద రూల్ షూటింగ్ అలా లాల్ లేట్ అవుతుంటే.. అల్లు అర్జున్ ముంబై లో బిజీ బిజీగా తిరుగుతున్నారు. మొన్నామధ్యన అల్లు అర్జున్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన సంజయ్ లీల భన్సాలీని కలిసినప్పటినుండి వారు ఇరువురు కలిసి ఏదో ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరుపుతున్నారనే అనే టాక్ నడిచింది.

Advertisement
CJ Advs

తాజాగా అల్లు అర్జున్ ముంబై లో కనిపించిన దాన్ని బట్టి ఆయన బాలీవుడ్ ప్రాజెక్ట్ విషయమై గట్టిగానే తిరుగుతున్నట్టుగా అర్ధమవుతుంది. అల్లు అర్జున్ ముంబై లోని బాంద్రాలో బాస్టియన్‌ రెస్టారెంట్ లో డిన్నర్ చెయ్యడం హైలెట్ అయ్యింది. అల్లు అర్జున్ స్టైలిష్‌గా మరియు క్యాజువల్‌గా బల్క్ టీ-షర్టుతో మరియు వైట్ ప్యాంటు ధరించి బ్లాక్ కలర్ చెప్పులు, బ్లాక్ కలర్ క్యాప్ ధరించి సింపుల్ గా కనిపించారు. ఇక అల్లు అర్జున్ స్ట్రయిట్ బాలీవుడ్ ఫిలిం కోసమే ఇలా సైలెంట్ గా ముంబై కి వచ్చారని, ఇప్పుడు కూడా ఆయన బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీల ని కలిసి ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

What's Icon Star doing in Mumbai:

Secret behind Allu Arjun Mumbai moves
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs