Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ రేంజ్ అది


పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ వరసగా సినిమాలు చేస్తున్నారు. హరి హర వీరమల్లు సెట్స్ మీద ఉండగానే సైలెంట్ గా సముద్రఖని దర్శకత్వంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తమిళ రీమేక్ మొదలు పెట్టేసారు. మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తో మళ్ళీ సినిమాల్లోకి కం బ్యాక్ అయిన పవన్ కళ్యాణ్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆయన క్రేజ్ రేంజ్ అన్ని మరింతగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ పారితోషకం లెక్కలూ ఉంటున్నాయి. ఇప్పటికే ఒక్కో సినిమాకి 50 కోట్లపైనే పారితోషకం పవన్ తీసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు సముద్రఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీలో 20 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కి సంబందించిన చిత్రీకరణ పూర్తయ్యిపోతుంది. పవన్ కళ్యాణ్ సోలో సీన్స్ అన్ని కూడా 20 రోజుల్లోనే ముగించెయ్యబోతున్నారు. మాగ్జిమమ్ షూట్ గ్రీన్ మ్యాట్ లోనే చెయ్యబోతున్నారు. సీజీ వర్క్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పాత్రకి హీరోయిన్ పాటలు ఏమి లేని సినిమా కాబట్టి తన పార్ట్ చాలా త్వరగా కంప్లీట్ అవ్వబోతుంది. సుమారు 20 రోజుల్లో డబ్బింగ్ తో సహా తన పార్ట్ షూటింగ్ వూర్తి చెయ్యబోతున్న పవన్ కళ్యాణ్ 20 రోజులకి 50 కోట్లకి పైగా పారితోషకం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అంటే దాదాపు రోజుకి 2.5 కోట్లన్నమాట. అంతేనబ్బా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. 

Pawan Kalyan stunning remuneration for a remake:

Pawan Kalyan taking home Rs 50 crore for 20 days
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs