Advertisement
Google Ads BL

నా కెరీర్ లో అదే చెత్త సినిమా: పూజ హెగ్డే


నిన్నమొన్నటివరకు పూజ హెగ్డే అంటే లక్కీ హీరోయిన్, స్టార్ హీరోలకి కేరాఫ్ అడ్రెస్స్ పూజ హెగ్డే అంటూ ఆమెని ఎత్తేసిన మీడియా ఇప్పుడు వరసగా మూడు ప్లాప్స్ పడగానే ఐరెన్ లెగ్ హీరోయిన్ అంటూ ముద్ర వేస్తున్నారు. వరసగా మూడు ప్లాప్స్ ఉన్నప్పటికీ పూజ హెగ్డే కి ఆఫర్స్ తగ్గడం లేదు. సల్మాన్ ఖాన్ తో కభీ ఈథ్‌ కభీ దివాలీ, విజయ్ దేవరకొండ తో JGM చిత్రాల్లో ఆఫర్స్ పట్టేసింది. అయితే తాజాగా పూజ హెగ్డే తన కెరీర్ లో తాను చేసిన ఓ చెత్త సినిమా వలన ఓ ఏడాది కెరీర్ కోల్పోయానని చెప్పుకొచ్చింది. తన సక్సెస్ లు అలాగే ఫెయిల్యూర్ పై కూడా మాట్లాడింది పూజ హెగ్డే.

Advertisement
CJ Advs

నేను నటించిన ఆరు సినిమాలు వరసగా హిట్ అవడం నా కెరీర్ లో పెద్ద సక్సెస్. అదే విధంగా బాలీవుడ్ లో నా డెబ్యూ సినిమా మొహంజోదారో నా కెరీర్ లో చెత్త సినిమాగా మిగలడమే కాదు, ఆ సినిమా వలన ఓ ఏడాది పాటు నాకు అవకాశాలు రాలేదు. ఆ సినిమా ప్లాప్ అవడంతో నాకు ఐరెన్ లెగ్ అనే పేరొచ్చింది. అలాగే నా కెరీర్ లో అలా వైకుంఠపురంలో నాకు బ్రేక్‌ ఇచ్చింది. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా నా కెరీర్‌ను అద్భుతంగా మార్చింది అంటూ పూజ హెగ్డే చెప్పుకొచ్చింది.

Pooja Hegde talk about Lowest Point Of Her Career:

Pooja Hegde Recalls Debut In Mohenjo Daro Was Lowest Point Of Her Career
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs