Advertisement
Google Ads BL

భార్యతో తెగతెంపులు, ఆమెతోనే ఉంటున్నా: పృథ్వి


30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి అంటే ఒకప్పుడు సినిమాలతో కళకళలాడుతూ ఉన్న నటుడు. కానీ ఎప్పుడైతే వైసిపీలో చేరి ఇండస్ట్రీ ప్రముఖులని, పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడో.. అప్పుడే ప్రుధ్వి ఇండస్ట్రీకి కొద్ది కొద్దిగా దూరమవుతూ వస్తున్నాడు. చేతిలో అవకాశాలు తాగగాయి, అక్కడ వైసిపి పార్టీలో తనకున్న ప్రాముఖ్యత తగ్గడంతో దిగి వచ్చిన పృథ్వి ఇప్పుడు వైసిపికి బై బై చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేనలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే అటు ప్రొఫెషనల్ గా మీడియాలో ఎంతగా ఎక్సపోజ్ అయ్యాడో.. ఇటు పర్సనల్ లైఫ్ లోను అంతే హైలెట్ అయ్యారు పృథ్వి.

Advertisement
CJ Advs

ఈ మధ్యనే పృథ్వి తన పర్సనల్ లైఫ్ గురించి మట్లాడుతూ తన భార్య తో తనకి విభేదాలు ఉన్నాయి, ఆమెని విడిచి తాను దూరంగా ఉంటున్నాను అని, తన పిల్లలు హ్యాపీ గా సెటిల్ అయ్యి ఆనందంగా ఉన్నారని, ప్రస్తుతం భార్య, పిల్లలకి దూరంగా హైదరాబాద్ లో ఉంటున్నాను అని చెప్పినాన్ పృథ్వి భార్య పిల్లలు విజయవాడలో ఉంటున్నారని చెప్పారు. అయితే తనకి చెన్నై లో ఉన్నప్పటి నుండి ఒకామెతో పరిచయం ఉంది అని, ఆమె పేరు పద్మరేఖ, తన కష్టసుఖాల్లో తనకి తోడు నీడగా ఉంది అని, ఆమెకి సహాయం చేసే మనస్తత్వం అని, ప్రస్తుతం తాను ఆమెతోనే ఉంటున్నాను అని, ఎనిమిదేళ్లుగా తన భార్యాపిల్లలుతో దూరంగా ఉంటున్నాను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో ఎవరైనా ఉన్నారు అంటే అది దాసరి పద్మరేఖ అని చెప్పుకొచ్చాడు పృథ్వి.

Prudhvi Raj about his personal family issues.:

30 years industry fame Prudhvi Raj about his personal family issues
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs