ఎన్టీఆర్ - కొరటాల మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎన్టీఆర్ ఫాన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి మూడు నెలలు గడిచిపోయింది. కానీ ఎన్టీఆర్ కొత్త సినిమా ఊసు లేదు. ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎంతో గ్రాండ్ గా కొరటాల NTR30 వీడియో రిలీజ్ చేసారు.. ఫాన్స్ కూల్ అయ్యారు. ఇక జూన్ నుండి కొరటాల - ఎన్టీఆర్ మూవీ మొదలవుతుంది అనుకుంటే జూన్ మాసం ముగిసిపోయింది కానీ.. ఇంతవరకు ఆ ముచ్చట లేదు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు.
కొరటాల ఆచార్య చిక్కుల్లో నుండి బయటకి రాలేదా? అందుకే ఈ సినిమా లేటా అనే కన్ఫ్యూషన్ లో ఫాన్స్ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ వలనే NTR30 లేట్ అవుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ వెయిట్ పెరిగారు. ఇప్పుడు NTR30 కోసం వెయిట్ తగ్గించుకునే ప్రాసెస్ లో ఎన్టీఆర్ ఉన్నారట. దాదాపుగా 10 నుండి 15 కిలోల బరువు తగ్గించాల్సి రావడంతోనే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అని అంటున్నారు. మరోపక్క అలియా భట్ NTR30 నుండి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ కూడా ఓ సమస్యగా మారిందట. కియారా అద్వానీ కోసం ట్రై చేస్తుంటే.. ఆమె బాలీవుడ్ మూవీస్, సౌత్ మూవీస్ తో బిజీగా మారడంతో డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోతుంది అని టాక్.