Advertisement
Google Ads BL

మెట్లపై నుండి జారిపడిన హీరోయిన్


టాలెంటెడ్ హీరోయిన్ నిత్య మీనన్ ఈమధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. రీసెంట్ గా వచ్చిన భీమ్లా నాయక్ లో తప్ప. నిత్యా మీనన్ బరువు పెరగడంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నిత్యా మీనన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ నటి నుండి దర్శకురాలిగా టర్న్ అవ్వాలనుకుంటుందట. త్వరలోనే నిత్యా మీనన్ దర్శకత్వంలో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే రెండు రోజుల క్రితం మెట్ల పై స్లిప్‌ అయ్యి నిత్య మీనన్ కాలుకి ఫ్రాక్చర్ అయ్యినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గా నిత్య మీనన్ టాలీవుడ్ లో జరిగిన మోడర్న్ లవ్ హైదరాబాద్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరవగా.. ఆమె వీల్ చైర్ లో రావడం, స్టేజ్ పైకి ఎక్కేటప్పుడు స్టిక్ అలాగే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం చూసిన మీడియా వారు ఆమెని ప్రశ్నించగా.. తాను రెండు రోజుల క్రితం మెట్లపై కాలు జారీ పడడంతో కాలుకి ఫ్రాక్చర్ అయినట్లుగా చెప్పింది. డాక్టర్స్ చెక్ చేసి ప్రమాదం ఏమి లేదని, ఫ్రాక్చర్ అవడంతో కట్టు వేశారని ఆమె చెప్పారు. 

Nithya Menon Leg Fracture:

Actress Nithya Menon Leg Fracture
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs