Advertisement
Google Ads BL

ఇందులో తప్పెవరిది ప్రియాంకా..


సెలబ్రిటీస్ అన్నాక రూమర్స్ క్రియేట్ అవ్వకుండా ఉండవు, అవి సోషల్ మీడియాలో వైరల్ అయినా ఎవ్వరూ ఆపలేరు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం రూమర్స్ పై స్పందించినా మరికొంతమంది మాత్రం కామ్ గా ఉండిపోతారు. అసలు సెలెబ్రిటీ అంటేనే రూమర్, రూమర్ అంటేనే సెలెబ్రిటీ అనే విషయం అందరికి తెలుసు. ఇప్పుడొక హీరోయిన్ సరదాగా తాను పోస్ట్ చేసిన పిక్ తో ఇబ్బందుల్లో పడింది. ఆమె ఎవరో కాదు ప్రియాంక జవల్కర్. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ప్రేమలో పడిందనే న్యూస్ ఎప్పటినుండో నడుస్తున్నది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ప్రియాంక జవల్కర్ తన ఎదుటి వ్యక్తిని ఫ్రేమ్ లో ఫేస్ కనిపించకుండా బ్యాక్ ని కవర్ చేస్తూ అందులో తానే ఆ వ్యక్తికి ఎదురుగా కూర్చున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో ప్రియాంక ఎదుట కూర్చున్నది వెంకటేశ్ అయ్యర్ అంటూ చాలామంది ఫిక్స్ అయ్యిపోయి.. దానిని వైరల్ చేసిపారేసారు. దానితో ప్రియాంక జవల్కర్ లైన్ లోకి వచ్చేసి.. ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి తమకు పనిలో సాయం చేసేందుకు వచ్చాడని, అతను తన బాయ్‌ ఫ్రెండ్ అని వార్తలు వస్తుండటంతో ఏంటో విషయం అంటూ తన తల్లి ఆరాతీసింది అని, ఇలాంటి వార్తాలు రాసేముందు ఆలోచించమని ప్రియాంక కోరుతుంది. 

అయితే తనకి సాయం చెయ్యడానికి వచ్చిన వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ పిక్ తియ్యాల్సిన అవసరం లేదు, తీసినా సోషల్ మీడియాలో షేర్ చెయ్యాల్సిన పని లేదు, తీరా పోస్ట్ చేసాక అలాంటివి రాయకండి అంటే ఊరుకుంటారా.. ఇక్కడ తప్పెవరిది ప్రియాంకా.. ఒక్కసారి ఆలోచించు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Priyanka Jawalkar gives clarity about her Boyfriend .:

Priyanka Jawalkar Gives Clarity On Boyfriend
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs