Advertisement
Google Ads BL

ఊ అంటావా.. సాంగ్ ని హమ్ చేసిన సల్మాన్


గత కొన్నిరోజులుగా సమంత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా సల్మాన్ ఖాన్ తో చేసే సినిమాతోనే సమంత హిందీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.. అందుకే మకాం ముంబై కి మారుస్తుంది అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. సల్మాన్ ఖాన్ చెయ్యబోయే ఓ సీక్వెల్ లో సమంత నే హీరోయిన్ గా అనుకుంటున్నారని అంటున్నారు. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా సాంగ్ నచ్చింది అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
CJ Advs

ఈ మధ్యన బాలీవుడ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ ని మిమ్మల్ని ఎంతగానో ఇన్‌స్పైర్‌ చేసిన సినిమా గానీ, పాట గానీ ఏదైనా ఉందా.. అని అడగగా.. దానికి సల్మాన్ ఖాన్ ఊ అంటావా మావా అంటూ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ని హమ్‌ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోను సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసారు. సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన సమంత హార్ట్‌ ఎమోజీస్‌తో సల్మాన్ ఖాన్ కి థాంక్స్ చెప్పింది. మరి ఇదంతా చూస్తే సల్మాన్ ఖాన్ - సమంత కలిసి సినిమా చేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నెటిజెన్స్. 

Salman Khan says Pushpa song Oo Antava inspired him:

Salman Khan says Pushpa song Oo Antava inspired him, Samantha Ruth Prabhu reacts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs