టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లికొడుకులు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. లాక్ డౌన్ లో హీరో నితిన్, రానా, నిఖిల్ పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి విషయం తేలడం లేదు. అలాగే శర్వానంద్, రామ్ ఇలా ఇంకా చాలామంది పెళ్లిళ్లు చేసుకోవాల్సిన వారిలో ఉన్నారు. అందులో రామ్ పోతినేని కూడా పెళ్లి పీటలెక్కడానికి రెడీగా ఉన్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో ద వారియర్ అంటూ బైలింగువల్ మూవీలో నటిస్తున్న రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి కొడుకుగా మారుతున్నాడట.
స్కూల్ డేస్ నుంచి రామ్‌కు ఓ అమ్మాయితో పరిచయం ఉండగా.. ఆ పరిచయం ప్రేమగా మారిందని.. ఇప్పుడు ఇద్దరూ కలిసి పెళ్లి వైపుగా ఇద్దరు అడుగు లేస్తున్నారని తెలుస్తుంది. పెద్దల అంగీకారంతోనే రామ్ పెళ్లి జరగబోతుంది అని, రామ్ పెళ్లి విషయమై త్వరలోనే అధికారికంగా పోతినేని ఫ్యామిలీ పోస్ట్ చేయనుంది అంటున్నారు. రామ్ పెళ్లి ఈ ఏడాదిలోపే జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే వారియర్ తర్వాత రామ్ బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. ఈ మధ్యనే ఈ మూవీ పూజ కార్యక్రమాలు జరిగాయి.