Advertisement
Google Ads BL

హమ్మ సమంతా బాలీవుడ్ భామలకే షాకిచ్చింది


సమంత ఇప్పటివరకు ఒక్క హిందీ స్ట్రయిట్ మూవీలో కూడా నటించలేదు. కేవలం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్, పుష్ప ఐటెం సాంగ్ లో తప్ప. ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ కూడా పాన్ ఇండియా స్టయిల్లోనే రిలీజ్ అయ్యింది. కానీ ఇప్పుడు సమంతా చేసే స్కిన్ షో కి బాలీవుడ్ హీరోయిన్స్ షాకవుతున్నారు. అంతేకాదు సమంత తాజాగా హిందీ హీరోయిన్స్ కే కోలుకోలేని షాకిచ్చింది. ఎలా అంటే.. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటూ.. ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ పేరు మీద ఓర్మాక్స్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే లో ఏ దీపికానో, లేదంటే ఏ అలియా భట్టో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తారు అనుకుంటే.. ఏకంగా సమంతా నెంబర్ 1 ప్లేస్ ని ఆక్రమించడం చూసిన బాలీవుడ్ హీరోయిన్స్ షేకయిపోతున్నారు. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ అవార్డ్స్ ఫంక్షన్స్, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోస్, సమంతకి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అన్ని కలిపి ఆమెని నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఇక సమంతా తర్వాత ప్లేస్ లో అలియా భట్, ఆ తర్వాత ప్లేస్ లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నిలిచింది. సమంతా, అలియా, నయన్ తర్వాత ప్లేస్ కి దీపికా రావడం ఆమె ఫాన్స్ కి నిజంగా షాకింగ్ విషయమే. ఆ తర్వాత స్థానాల్లో కాజల్ అగర్వాల్‌, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజ హెగ్డే, అనుష్కా శెట్టిలు నిలిచారు. ఒక్కటంటే ఒక్క హిందీ ప్రాజెక్ట్ చెయ్యకుండా సమంతా అక్కడి హీరోయిన్స్ ని పక్కకి నెట్టి నెంబర్ వన్ లో నిలవడం మాములు విషయం కాదు. 

Samantha Ruth Prabhu Beats Alia, Deepika:

Samantha Ruth Prabhu Beats Alia, Deepika To Become No.1
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs