ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి మూడు నెలలు గడిచిపోయింది. ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాని మొదలు పెట్టలేదు. కొరటాల తో ఎన్టీఆర్ సినిమా అప్ డేట్ మే 21 ఎన్టీఆర్ బర్త్ డే కి ఇచ్చారు. అది కూడా వచ్చి నెల అయ్యింది. కానీ కొరటాల ఇంతవరకు NTR30 మొదలు పెట్టే ఆలోచనలో లేనట్లుగా కనిపిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కొరటాలపై ఫైర్ అవుతున్నారు. మరో పక్క మరో ట్రిపుల్ ఆర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ తో బిజీగా వున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా కొత్త సినిమా మొదలు పెట్టి సెట్స్ మీదకి వెళ్ళలేదు అంటూ ఫాన్స్ తీవ్ర నిరాశలోకి వెళుతున్నారు.
అంతా సూపర్ లైనప్. కానీ మూవీ మొదలు పెట్టడానికి ముహూర్తమే దొరకడం లేదా అని.. ఎన్టీఆర్ ఫాన్స్ కొరటాల ని క్వచ్చన్ చేస్తున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చక చక లాగించేటిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కొరటాల మూవీ మొదలే లేదు. కొరటాల మూవీ ఫినిష్ అయితేనే ప్రశాంత్ నీల్ మూవీ మొదలు పెట్టేది. అసలే అరవింద సమేత తర్వాత మూడున్నరేళ్ళకి ఎన్టీఆర్ ని ఆర్ ఆర్ ఆర్ తో సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్న ఫాన్స్ కి మళ్ళీ ఎంత గ్యాప్ తీసుకోవాలో తెలియక వాళ్లలో కంగారు మొదలయ్యింది. మరి NTR30 మొదలు పెట్టడానికి ఉన్న అడ్డంకులు అర్ధం కాక ఫాన్స్ మాత్రం తల పట్టుకుంటున్నారు.