బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ వరసబెట్టి సినిమాలని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి జగ్ జుగ్ జియో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జగ్ జుగ్ జియో ప్రమోషన్స్ లో గ్లామర్ డ్రెస్సు లతో యూత్ మతి పోగొట్టిన కియారా అద్వానీ అందాలను సోషల్ మీడియా వర్ణిస్తూనే ఉంది. అయితే జగ్ జుగ్ జియో ప్రమోషన్స్ లో భాగంగా కియారా కి ఓ ఇంట్రెస్టింగ్ క్వచ్చన్ ఎదురైంది. అది ప్రేమికులైన, భార్యా భర్తలైనా తగవు పడినప్పుడు ముందుగా ఎవరు సారీ చెప్పాలి అని. దానికి కియారా అద్వానీ చాలా బోల్డ్ గా అందంగా సంధానం చెప్పింది. ఏ రిలేషన్ షిప్ లో అయినా గొడవలు జరగడం సహజం. గొడవలు జరిగినప్పుడు తామే ముందు సారీ చెబుతామని పెళ్ళైన వ్యక్తులు అంటే విన్నాను.
కానీ నా దృష్టిలో గొడవలు ఎవరి వల్ల మొదలైనా సారీ చెప్పడం ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. పెళ్లి తర్వాత వచ్చే గొడవల విషయం నాకు తెలియదు. కానీ నా వరకు నేను ఏదైనా గొడవ జరిగితే ముందే సారీ చెప్పి ఆ గొడవకి అక్కడితో ఫుల్ స్టాప్ పడేలా చేస్తాను. అందుకే సారి చెప్పడానికి అస్సలు ఆలోచించను అంటూ చెప్పుకొచ్చింది. మరి కియారా ఈమధ్యన తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రా తో గొడవపడి బ్రేకప్ చేసుకుంది అనే ప్రచారం జరిగినా ఆ విషయమై ఎక్కడా క్లారిటీ రాలేదు.