ఈ ఏడాది మొదలు ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ఒక వారం పెద్ద సినిమా, మరో వారం చిన్న సినిమాలు అంటూ, పెద్ద సినిమాలకు రెండు వారలు గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇక పాన్ ఇండియా మూవీస్, బిగ్ బడ్జెట్ మూవీస్ మధ్యలో స్మాల్ బడ్జెట్ మూవీస్, అలాగే మీడియం బడ్జెట్ మూవీస్ కూడా విడుదలవుతున్నాయి. అయితే ఈ వారం ఏకంగా నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు తమకి తగ్గ ప్రమోషన్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
కానీ ఆ సినిమాల్లో ఒక్కటి కూడా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయలేకపోయాయి. అసలే రెండు వారాలుగా బోరింగ్ గా ఉన్న బాక్సాఫీసు ఈ వారం మరింత బోర్ కొట్టించేదిలా ఉంది. జూన్ 10 అంటే సుందరానికి వచ్చింది.. సో సో గా ఆడింది. ఆ తర్వాత విరాట పర్వం వచ్చింది. అది అంతే టాక్ బావున్నా థియేటర్స్ లో ప్రేక్షకులు నిల్. ఇక ఈ వారం కిరణ్ అబ్బవరం సమ్మతమే, సుమంత్ అశ్విన్ 7 డేస్, 6 నైట్స్, ఆకాష్ పూరి చోర్ బజార్, లక్ష గ్యాంగ్ స్టర్ గంగరాజు ఇలా వరసగా రిలీజ్ అయినా నాలుగు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాయి.
ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా ఇంట్రెస్ట్ ని కలిగించలేకపోయాయి. అటు క్రిటిక్స్ కూడా ఈ సినిమాలన్నిటికీ రెండు లోపే రేటింగ్స్ తో సరిపెట్టేసారు. దానితో ప్రేక్షకులు డల్ అయ్యారు.. ఛ ఈ ఫ్రైడే మరీ బోర్ గా వుంది అంటూ పెదవి విరుస్తున్నారు.