రకుల్ ప్రీత్ సోషల్ మీడియా క్వీన్. సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ షేర్ చేసే ఫొటోస్ కి లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. జీరో సైజు మెయింటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో సినిమాలే కాదు, బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి మాత్రం ఇప్పుడే కాదంటుంది. అయితే ఎప్పుడూ ఫొటోస్ తోనే గ్లామర్ షో చేసే రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు డాన్స్ వీడియో తో యూట్యూబ్ నే కాదు, ఇన్స్టాని షేక్ చేసింది. తాజాగా రకుల్ ప్రీత్ సెలబ్రిటీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద డాన్స్ లో శిక్షణ తీసుకుని మరీ.. పసూరి సాంగ్ కు చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో 20 కోట్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది.
అదే డాన్స్ వీడియో ని ఆమె ఇన్స్టా లోను షేర్ చేసింది. రకుల్ ఆ వీడియో షేర్ చేసిన గంటలోనే 3 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. రకూల్ డాన్స్ చూస్తే నెమలి నృత్యం చేసిందా అనేలా ఉంది. అందమైన ఎక్సప్రెషన్స్ లోనే కాదు గ్లామర్ గాను రకుల్ ప్రీత్ డాన్స్ వీడియో లో అదరగొట్టేసింది. రకుల్ ప్రీత్ డాన్స్ వీడియోపై ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ.. మై డియర్ లవ్.. నాక్కూడా నేర్పించవా?.. అంటూ కామెంట్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా మారింది.