Advertisement
Google Ads BL

బాలీవుడ్ కి హిట్ ఇచ్చాడు-కాస్ట్లీ గిఫ్ట్ పట్టాడు


బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ తో గొడవ పడ్డాడని, అందుకే ధర్మా ప్రొడక్షన్ లో సినిమాలు చెయ్యడం లేదు హీరో కార్తీక్ ఆర్యన్ అనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ సైలెంట్ గా కైరా అద్వానీతో కలిసి భూల్‌ భులాయా 2 తో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు, కొన ఊపుతో కొట్టుకుంటున్న బాలీవుడ్ బాక్సాఫీసు ఊపిరి పీల్చుకునేలా చేసాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు వారాలు దాటిపోయినా.. ఇంకా భూల్‌ భులాయా 2 కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ చిత్రం 184.32 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా మూవీస్ హవా హిందీ బాక్సాఫీసు ని కుదిపేస్తున్న టైం లో హిందీలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దర్శకనిర్మాతలు ఫుల్ హ్యాపీ గా వున్నారు.

Advertisement
CJ Advs

అందుకే తనకి అంతలాంటి హిట్ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కి నిర్మాత భూషణ్ కుమార్ అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మెక్‌లారెన్‌ జీటీ అనే స్పోర్ట్స్‌ కారును కార్తీక్ ఆర్యన్ కి గిఫ్టిచ్చాడు. దీని ఖరీదు దాదాపు రూ.4.7 కోట్లు. అయితే ఇండియాలోనే ఇంత కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా బాలీవుడ్ హీరో కార్తీక్‌ ఆర్యన్ నిలిచాడు. కారుని గిఫ్ట్ గా అందుకున్న కార్తీక్ ఆర్యన్.. కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్‌ జీటీ యజమానిని. నెక్స్ట్‌ టైం ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌.. అంటూ ఫన్నీ గా థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసాడు.

Bhool Bhulaiyaa 2 producer Bhushan Kumar gifts Kartik Aaryan:

Kartik Aaryan gets Rs 4.7 crore McLaren GT as gift from Bhool Bhulaiyaa 2 producer Bhushan Kumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs