ఇప్పుడు సమంత బాలీవుడ్ ఎంట్రీ పై రకరకాల న్యూస్ లు మీడియాలో వినిపిస్తున్నాయి. సమంత బాలీవుడ్ ఎంట్రీ కోసమే ముంబై కి మకాం మార్చబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈమధ్యన సమంత చాలావరకు ముంబైలో కనబడుతుంది. అక్కడ అవార్డు ఫంక్షన్స్, వరుణ్ ధావన్ తో మీటింగ్, రన్వీర్ సింగ్ తో సెల్ఫీ అంటూ హడావిడి చెయ్యడమే కాదు, గ్లామర్ షో తో అక్కడి హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా తయారైంది. స్కిన్ షో అంటూ చిన్న చిన్న డ్రెస్సులతో చెలరేగిపోతుంది.
అయితే సమంత బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అని, అది కూడా భాయ్ సల్మాన్ ఖాన్ మూవీ తో అంటున్నారు. అయితే సల్మాన్ ఖాన్ మూవీలో పది మంది హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు అని ప్రచారం జరుగుతుంటే.. మరోపక్క సల్మాన్ ఖాన్ గతంలో నటించిన ఓ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాలో పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ ఉన్నసమంత ని హీరోయిన్ గా అనుకుంటున్నారని అంటున్నారు. అయితే ఆ పదిమంది హీరోయిన్స్ లో సమంత ఒకరా.. లేదంటే సల్మాన్ తో సోలోగానా అనే అనుమానం ఆమె ఫాన్స్ లో మొదలైంది. ఏది ఏమైనా ఈ ఏడాది సమంత బాలీవుడ్ ఎంట్రీ ఖాయమనే మాట వినిపిస్తుంది.