Advertisement
Google Ads BL

ఎప్పుడూ వివాదాస్పదమేనా జాన్


బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈమధ్యన వివాదాలకు నెలవుగా మారుతున్నాడు. రీసెంట్ గానే జాన్ అబ్రహం నటించిన ఎటాక్ సినిమా ప్రమోషన్స్ లో తాను సౌత్ సినిమాల్లో నటించను, ఎన్ని పాన్ ఇండియా మూవీస్ వచ్చినా.. బాలీవుడ్ ఎప్పటికి నెంబర్ 1 అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఆ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయిన ఎటాక్ మూవీ సోదిలోకి కూడా లేకుండా పోయింది. ఇక ఇప్పుడు తన మరో సినిమా ఏక్ విలన్ రిటర్న్స్ ప్రమోషన్స్ లో జాన్ అబ్రహం ఓటిటి ఎంట్రీ పై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. జాన్ అబ్రహం నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం కి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.

Advertisement
CJ Advs

అది ప్రస్తుత కాలంలో ఓటిటి ప్రాధాన్యత పెరిగింది. హిందీ నుండి చాలామంది హీరోలు ఓటిటి ఎంట్రీ కి రెడీ అవుతున్నారు. మీ ఓటిటి ఎంట్రీ ఎప్పుడూ ఉంటుంది అని అడిగిన ప్రశ్నకి నేను బిగ్ స్క్రీన్ హీరోని. నా సినిమాలు ఓన్లీ సిల్వర్ స్క్రీన్ పైనే ఆడాలనుకుంటాను. వెండితెరపైనే నన్ను నేను చూసుకోవాలని అనుకుంటున్నాను. నేను 299, 499 రూపాయలకి అందరికి అందుబాటులో ఉండే హీరోని కాను. నేను వెండితెర మీదే సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటూ కుండా బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.

John Abraham Biggest Controversies:

John Abraham says he would not like to be available for ₹299 or 499 on OTT: I am a big-screen hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs