Advertisement
Google Ads BL

మరోసారి వార్తల్లోకి రియా చక్రవర్తి


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ ఆత్మహత్య కాస్తా బాలీవుడ్ సెలెబ్రిటీస్ మెడకి డ్రగ్స్ కేసులా మారడం, సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తి జైలు పాలై బెయిల్ పై బయటికి రావడం అన్ని తెలిసినవే. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షౌవిక్ లు సుశాంత్ సింగ్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశారనే ఆరోపణలతో కొన్నాళ్ళు జైలు జీవితం గడిపి ప్రస్తుతం వారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇదంతా రెండేళ్ల మాట. తర్వాత రియా చక్రవర్తి మళ్ళీ షూటింగ్స్ తో కొద్దిగా బిజీగా మారింది. మళ్ళీ ఇన్నాళ్ళకి రియా చక్రవర్తి పేరు ఈ డ్రగ్స్ కేసులో హాట్ టాపిక్ గా మారింది. 

Advertisement
CJ Advs

ఈ కేసుని 2020 నుండి ఎన్‌సిబి డ్రగ్స్ కోణం నుండి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు విచారణ సమయంలో రియా మరియు ఆమె సోదరుడు షౌవిక్ కోర్టుకు హాజరయ్యారు. రియా చక్రవర్తి తో పాటుగా ఆమె సోదరుడు సౌవిక్ డ్రగ్స్ వాడారని, అంతేకాకుండా షౌవిక్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్ కొన్నాడని, ప్రస్తుతం కోర్టు అందరిపై అభియోగాలు మోపబోతోందని, అయితే కొంతమంది నిందితులు డిశ్చార్జ్ దరఖాస్తులు దాఖలు చేసినందున అది జరగలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. విచారణలో కోర్టు ఈ ఆరోపణలను అంగీకరిస్తే, రియా చక్రవర్తికి సమస్యలు పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రత్యేక న్యాయమూర్తి వీజీ రఘువంశీ ఆధ్వర్యంలో ఈ కేసుపై తదుపరి విచారణ జూలై 12 కి వాయిదా పడింది.

Rhea Chakraborty, Showik Chakraborty Charged by NCB in Drugs Case Linked to Sushant Singh Rajput Death:

NCB files charges against Rhea Chakraborty, brother Showik in drugs case linked to Sushant Singh Rajput
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs