పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమా షూటింగ్స్ అంటూ చాలా బిజీ లైఫ్ ని మెయింటింగ్ చేస్తున్నారు. కొద్దిరోజులు షూటింగ్స్, కొద్ది రోజులు పాలిటిక్స్ అంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ విషయంలో ఈ మధ్యన ఫాన్స్ లో కంగారు ఎక్కువగా కనిపిస్తుంది. భీమ్లా నాయక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలోనూ వీరమల్లు గెటప్ లో కాస్త లాంగ్ హెయిర్ కొద్దిగా ఫిట్ గా కనిపించిన ఆయన రీసెంట్ లుక్ చూస్తే మాత్రం నిజంగా ఫాన్స్ కి ఒణుకు వచ్చేలా ఉంది.
పవన్ కళ్యాణ్ తాజాగా విశ్వక్ సేన్ - అర్జున్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధిగా వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ తో డీప్ డిస్కర్షన్ పెట్టడమే కాదు, మంచు విష్ణు కి కరచాలనం చేసిన పవన్, విశ్వక్ - ఐశ్వర్య అర్జున్ సినిమా ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టారు. అయితే ఈ ఓపెనింగ్ లో పవన్ కళ్యాణ్ క్లోజప్ షాట్ చూస్తే మొహం బాగా ఉబ్బిపోయి కనిపించింది. కాస్త లావుగా ఆయిన్ పవన్ బరువెక్కిన లుక్ చూసిన ఆయన ఫాన్స్ బావురుమంటున్నారు. వరస సినిమాలు చేతిలో ఉన్నాయి.. కానీ ఫిట్ నెస్ విషయంలో పవన్ ఇలా శ్రద్ద లేకుండా ఉంటే ఎలా అని ఫీలవుతున్నారు.