Advertisement
Google Ads BL

ఈసారి బాలయ్యతో చిరు పక్కా..


బాలకృష్ణ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టి అల్లు అరవింద్ ఆహా కోసం అన్ స్టాపబుల్ టాక్ షో చెయ్యడమే ఓ షాకింగ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ అల్లు అరవింద్ తో షో చెయ్యడమంటే మాములు విషయం కాదు. అలాంటిది అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ ఆహా టాక్ షో ని అదరగొట్టేసారు. యంగ్ హీరోస్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రానా తో పాటుగా మోహన్ బాబు, రవి తేజ, రాజమౌళి లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్న ఈ షో విపరీతంగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు సీజన్ 2 కోసం మెగా - నందమూరి ఫాన్స్ వెయిటింగ్ అంటున్నారు.

Advertisement
CJ Advs

త్వరలోనే అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలు కాబోతుంది అంటూ బాలకృష్ణ తెలుగు ఐడల్ షో స్టేజ్ పై చెప్పారు. దానితో ఆ షో పై అంచనాలు మొదలు కాగా.. సెకండ్ సీజన్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో బాలయ్య ఇంటర్వ్యూ చేయబోయేది మెగాస్టార్ చిరు నే అంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బాలకృష్ణ - చిరు ఫ్రెండ్స్ లా కనిపించినా.. మొన్నీమధ్యన బాలయ్య బర్త్ డే కి చిరు విష్ చెయ్యకపోవడం నందమూరి ఫాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. అలాంటిది ఒకే స్టేజ్ పై బాలయ్య - చిరు లు టాక్ షో చేస్తే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే అల్లు అరవింద్ చిరు - బాలయ్య లతో సీజన్ 2 ఓపెనింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 

Meet The First Guest Of Balakrishna Unstoppable Season 2:

Balakrishna Unstoppable Season 2 update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs