Advertisement
Google Ads BL

ఫేక్ న్యూస్ పై జబర్దస్త్ వర్ష ఫైర్


సోషల్ మీడియా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక అందులో కొంత మంచి జరుగుతుంటే మరోకొంత చెడు జరుగుతుంది. మంచి కన్నా ఎక్కువగా చెడుకే నెటిజెన్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానితో యూట్యూబ్ ఛానల్స్, ఫేస్ బుక్స్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. కొంతమంది సెలబ్రిటీస్ చనిపోయారంటూ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు కొందరు. దానితో చాలామంది తమకి ఏం కాలేదు అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్తితికి వచ్చేసింది. యుట్యూబర్స్ కూడా థంబ్‌నెయిల్‌ లో పెట్టే టైటిల్స్ చూస్తే వెన్నులో ఒణుకుపుట్టేస్తుంది. తీరా మేటర్ లోకి వెళితే ఏం ఉండదు.

Advertisement
CJ Advs

ఇలాంటి టైటిల్స్ పై సెలబ్రిటీస్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వారు మారరు. తాజాగా జబర్దస్త్ వర్ష ఇలాంటి ఫేక్ న్యూస్ లపై ఫైర్ అయ్యింది. చావుబ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష.. కుప్పకూలిన సుధీర్, రష్మీ, ఇమ్మాన్యువల్ అంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే వర్ష.. ఆ న్యూస్ అలాగే టైటిల్ చూసి ఆ వార్త నిజం కాదని, ప్రస్తుతం తాను సేఫ్ గా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చుకుంది. అంతేకాకుండా తనపై వచ్చిన ఆ న్యూస్‌ థంబ్‌నెయిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిందీ వర్ష. దానితో జబర్దస్త్ ఫాన్స్, వర్ష ఫాన్స్ ఊపిరి తీసుకుంటున్నారు.

Jabardast Varsha Fire on Fake News:

Jabardasth Varsha critical condition Fake News
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs